Vijayakanth: ‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!
December 28, 2023 / 02:30 PM IST
|Follow Us
కోలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ ఈరోజు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బదబడుతూ వస్తున్న ఆయన ఈరోజు చివరి శ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ ని విషాద ఛాయలు కమ్మేశాయి. విజయ్ కాంత్ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాగా పాపులర్. ఆయన సొంతంగా దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అనే పార్టీని స్థాపించి ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. అందుకే తమిళంలో ఈయన్ని చాలా మంది కెప్టెన్ విజయ్ కాంత్ అంటుంటారు. సినిమాల పరంగా చూసుకుంటే..
ఈయన ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో లేదంటే పెద్దరికం కలిగిన డబుల్ రోల్ సినిమాల్లో నటించేవారు. మాస్ ఆడియన్స్ లో విజయ్ కాంత్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఈయన సినిమాలు కలెక్షన్స్ కురిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ కాంత్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం జరిగింది. అందులో ‘ఠాగూర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఇంకా ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :
1) చట్టానికి కళ్ళు లేవు :
చిరంజీవి మాధవి జంటగా నటించిన ఈ సినిమా 1981 అక్టోబర్ 30 న రిలీజ్ అయ్యింది.సీనియర్ నటి లక్ష్మి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.తమిళంలో అదే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన విజయ్ కాంత్ ‘సట్టం ఒరు ఇరుత్తరై’ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటి స్టార్ హీరో విజయ్ తండ్రి అయిన ఎస్.ఎ.చంద్రశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు.
2) దేవాంతకుడు :
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాను కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. తమిళంలో విజయ్ కాంత్ హీరోగా రూపొందిన ‘వెట్రి’ కి ఇది రీమేక్.
3) మంచి మనసులు (1986) :
భాను చందర్ హీరోగా మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్ నటించిన వైదేగి కతిరున్తల్(1984) కి రీమేక్.
4) నేనే రాజు నేనే మంత్రి(1987) :
మోహన్ బాబు హీరోగా దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘నేనే రాజా నేనే మంతిరి'(1985) అనే సినిమాకి రీమేక్.
5) ఖైదీ నెంబర్ 786 :
చిరంజీవి, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బాపినీడు దర్శకుడు. తమిళంలో విజయ్ కాంత్ హీరోగా రూపొందిన ‘అమ్మన్ కోవిల్ కిజకాలే’ అనే చిత్రానికి రీమేక్.
6) దొంగ పెళ్లి (1988) :
శోభన్ బాబు హీరోగా విజయశాంతి, సుమలత హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రానికి రవి రాజా పినిశెట్టి దర్శకుడు. తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘నినైవే ఒరు సంగీతం’ (1987) అనే సినిమాకి ఇది రీమేక్.
7) ధర్మ తేజ (1989) :
కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమాకి పేరాల దర్శకుడు. ఇది తమిళంలో విజయ్ కాంత్ నాటించ్చిన ‘పూంతొట్టా కావల్కరన్’ (1988) కి రీమేక్.
8) నా మొగుడు నాకే సొంతం (1989) :
మోహన్ బాబు, జయసుధ నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘ఎన్ పురుషన్ తన్ ఎనక్కు మట్టుమ్తాన్’ (1989) అనే సినిమాకి ఇది రీమేక్
9) చిన రాయుడు (1992) :
వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకుడు.తమిళంలో విజయ్ కాంత్ హీరోగా నటించిన చిన్న గౌండర్ (1992) అనే సినిమాకి ఇది రీమేక్.
10) గమ్యం (1998) :
శ్రీకాంత్ హీరోగా రవళి హీరోయిన్ గా జి.అనిల్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘భరతన్’ (1992) అనే సినిమాకి రీమేక్.
11) మా అన్నయ్య(2000) :
రాజశేఖర్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విజయ్ కాంత్ హీరోగా రూపొందిన ‘వనతైప్పోల’ (2000) అనే సినిమాకి రీమేక్.
12) ఠాగూర్ (2003) :
చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘రమణ’ (2002) కి రీమేక్ గా రూపొందింది.
13) ఖుషి ఖుషీగా (2004) :
జగపతి బాబు, వేణు..లు హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళంలో (Vijayakanth) విజయ్ కాంత్ మెయిన్ హీరోగా నటించిన ‘ఎంగల్ అన్న’ (2004) కి రీమేక్.