Lokesh Kanagaraj: షాకిచ్చిన స్టార్ డైరక్టర్… పది సినిమాల తర్వాత గుడ్ బై!
June 20, 2023 / 08:29 PM IST
|Follow Us
సినిమాటిక్ యూనివర్స్… ఈ మాట మనం మహా అయితే హాలీవుడ్లో వినేవాళ్లం. గతంలో ఎప్పుడో ఇండియన్ సినిమాస్‌లో వినిపించినా అది ఎక్కువ రోజులు లేదు. అయితే ఇప్పుడు దేశం మొత్తం సినిమాటిక్ యూనివర్స్‌ను మరోసారి గుర్తుకుతెచ్చుకుందున్నా.. ఆ కోణంలో మన దర్శకులు ఆలోచించి సినిమాలు చేస్తున్నారన్నా.. ఒక దర్శకుడు కారణం. అదే ఎల్సీయూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్. అలాంటి యూనివర్స్‌ను నిర్మించే పనిలో ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు.
‘ఖైదీ’ సినిమాతో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నారు లోకేశ్ కనగరాజ్. అందులో హీరో పాత్రను రూపొందించిన విధానం, కథను నడిపిన విధానం, నేపథ్యం.. ఇలా అన్నీ అదిరిపోయాయి. ఆ తర్వాత కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించారు. ఈ రెండు సినిమాలను కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ను రూపొందించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ ‘లియో’ కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఇంకా ఈ యూనివర్స్‌లో చాలా సినిమాలున్నాయి అని చెప్పారు.
అయితే ఇటీవల హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా (Lokesh Kanagaraj) లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్వింటెన్ టరెంటీనోలా తాను కూడా పది సినిమాలు చేసి… ఫిల్మ్ మేకింగ్ ఆపేస్తానని చెప్పారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు షాకయ్యారు. నాకేం సుదీర్ఘ ప్రణాళికలు ఏవీ లేవు. అలాగే సినిమా పరిశ్రమలో శాశ్వతంగా ఉండిపోవాలని లేదు. సినిమాలు తీయాలనే ఉద్దేశంతో వచ్చా. షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించి… ఇప్పుడు సినిమాలు చేసేంతవరకు వచ్చా… అలా పది సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అని చెప్పారు.
ఎల్సీయూలో 10 సినిమాలు రావొచ్చు అంటూ తన కామెంట్స్‌పై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేశ్ కనగరాజ్. ‘లియో’ సినిమా కశ్మీర్లో భారీ షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. జులై చివరి నాటికి సినిమా పూర్తి చేస్తారట. అక్టోబరులో సినిమా రిలీజ్ చేయాలనేది ప్లాన్. దీని తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీతో లోకేశ్ సినిమాలు చేయల్సి ఉంది. ప్రభాస్, రామ్‌చరణ్,ఎన్టీఆర్‌తో కూడా సినిమాలు చేస్తారని టాక్. మరి ఏం చేస్తారో చూడాలి.