‘లవ్ టుడే’ హీరో సంచలన నిర్ణయం.. 3 ఏళ్ళ బ్రతుకు ఖరీదంటున్న ప్రదీప్ రంగనాథన్..!
December 1, 2022 / 01:02 PM IST
|Follow Us
‘లవ్ టుడే’ .. తెలుగులో కూడా బ్లాక్ బ్లాక్ బస్టర్ కొట్టింది. రోజురోజుకు ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుంది. తమిళంలో నవంబర్ 4న రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తెలుగులో నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా స్టడీ రన్ ను కొనసాగిస్తుంది. నవంబర్ వంటి అన్ సీజన్లో కూడా ఈ మూవీ ప్రదర్శింపబడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కూడా కళకళలాడుతున్నాయి.
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వరల్డ్ వైడ్ గా రూ.70 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. యూత్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో నటించిన హీరో పేరు ప్రదీప్ రంగనాథన్. గతంలో ఇతను హీరోగా నటించింది లేదు. కానీ పక్కింటి అబ్బాయి పాత్రను చాలా నేచురల్ గా పోషించి అందరి మన్ననలు పొందాడు.
ఇదిలా ఉండగా.. గతంలో ఇతను ‘కోమలి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇదే ఇతనికి మొదటి చిత్రం. జయం రవి, కాజల్ జంటగా నటించిన ఈ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే తమిళంలో హిట్ అయినందుకు, మంచి కలెక్షన్లు రాబట్టినందుకు ఆ చిత్రం నిర్మాత ప్రదీప్ కు ఓ కారు గిఫ్ట్ గా ఇచ్చాడట.
కానీ అతను ఆ కారుని తీసుకోలేదు. వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఆ కారు ఎంత విలువ చేస్తుందో అంత డబ్బుని తనకు ఇవ్వమని కోరాడట. ఎందుకంటే ఆ కారులో పెట్రోల్/ డీజిల్ కొట్టించడానికి తన వద్ద డబ్బులు లేవట. దాని ప్లేస్ లో డబ్బు తీసుకుంటే తను 3 ఏళ్ళు బ్రతికేస్తానని చెప్పాడట. ప్రదీప్ నిజాయితీ నచ్చి.. కారు ప్లేస్ లో డబ్బులు ఇచ్చాడు సదరు నిర్మాత.