ప్రియా ప్రకాష్… సైడ్ క్యారెక్టర్ కి కూడా పనికి రాదు ..!

  • March 11, 2019 / 01:19 PM IST

‘లవర్స్ డే'(ఓరు ఆదార్ లవ్) చిత్రంలో ‘మాణిక్య మలరయ’ అనే పాటలో కన్నుగీటి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్. కేవలం ఈ ఒక్క క్లిప్ తో ఆమెకి భారీ క్రేజ్ ఏర్పడింది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే మొదట ప్రియా ప్రకాష్ ను ఈ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ కోసమే తీసుకున్నారట. అయితే సడెన్ గా ఆమెకి ఇంత క్రేజ్ పెరగడంతో తనని మెయిన్ హీరోయిన్ గా పెట్టేసారని ఇటీవల ఆ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ వేడి ఇంకా చల్లారకముందే ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ఒమర్ లులు కూడా ప్రియా ప్రకాష్ పై సంచలన కామెంట్స్ చేసాడు.

ఒమర్ ఈ ప్రియా ప్రకాష్ గురించి మాట్లాడుతూ… “ప్రకాష్ కి అసలు నటనే రాదు.. హీరోయిన్ గా ఆమె సరైన హావభావాలు కూడా పలికించలేదు. ప్రియా ప్రకాష్ కోసం తాను చాలా త్యాగాలు చేసాను కానీ తను మాత్రం సినిమా విడుదలైన తరువాత ప్రమోషన్స్ కి అస్సలు రాలేదు.. ఆమె ప్రచారం చేసుంటే కనీసం కలెక్షన్లు పెరిగి ఉండేవి.అసలు హీరోయిన్ నూరిన్ ని పక్కన పెట్టి ప్రియా చుట్టూ కథ తిరిగేలా మార్చడంతో సినిమాకి సరైన రిజల్ట్ రాలేదు. అసలు కాసేపు కనబడే పాత్రకి కూడా ప్రియా ప్రకాష్ పనికిరాదు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు ‘లవర్స్ డే’ డైరెక్టర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus