MAA Elections: మా ఎన్నికల్లో అందరూ పోటీ చేస్తే కష్టమే…!
June 24, 2021 / 12:57 PM IST
|Follow Us
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ప్రతిసారి ఉంటుంది. తొలినాళ్లలో అయితే ఏకగ్రీవం అవుతుందా అనేది ఆసక్తికర అంశంగా ఉండేది. గత రెండు పర్యాయాలుగా అయితే పోటీలో ఎవరు, ఎవరికి ఎవరు సపోర్టు చేస్తారు అనే అంశం బయటకు వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి ఇంకా డిఫరెంట్‌గా తయారైంది. కారణం పోటీలో చాలామంది నిలబడుతుండటమే. ఇప్పటివరకు నలుగురు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు వరకు ముందుకొస్తారని టాక్. అలా మొత్తం ఆరుగురు పోటీలో ఉంటారు. దీంతో అసలు సిసలు రాజకీయం బయటకొస్తుందంటున్నారు పరిశీలకులు.
సాధారణ రాజకీయాలకు, ‘మా’ఎన్నికలకు పెద్ద తేడా ఉండదు అని గత రెండు పర్యాయాలుగా తేలిపోయింది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చూశాం. మీడియా మందుకొచ్చి ఆందోళనలు, నిరసనలు కూడా కనిపించాయి. అయితే వాటికి మించి ఈ సారి ఉండబోతోందనేది పోటీలో ఉన్నవాళ్లను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పోటీలో ఉన్నవారిని చూసుకుంటే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఎవరికి వారే. ఓ విధంగా చెప్పాలంటే నలుగురూ ఫైర్ బ్రాండ్లే. ప్రకాశ్‌రాజ్ ఈ మధ్య కాస్త శాంతించారు. మిగిలిన ముగ్గురూ ఆల్వేజ్ ఆన్ ఫైర్. దీంతో ఈసారి పోరుగా గట్టిగానే ఉన్నట్లుంది.
ఇలా పోటీ గురించి అనుకుంటున్న సమయంలో టాలీవుడ్లో వినిపిస్తున్న మరో అంశం ‘రాజీ’. సాధారణ రాజకీయాల్లోలాగానే ‘మా’ఎన్నికల్లోనూ రాజీ ఉంటుంది. అలా ఎవరికివారు ఇతరుల్ని రాజీ చేయించి, పోటీ నుండి తప్పుకునేలా చేయాలని చూస్తున్నారట. ఓవైపు జీవిత రాజశేఖర్‌ను రాజీ చేయించాలని మంచు విష్ణు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. కొత్తగా పోటీలోకి వచ్చిన హేమను కూడా రాజీబాట పట్టించాలని ఓ వర్గం ప్రయత్నిస్తోందట. దీంతో పోటీలో ఎన్ని పేర్లు వినిపించినా ‘రాజీ’ ఆట ముగిశాక కానీ… ఎవరు ఫైనల్ అనేది తెలియదు. సో వెయిట్ అండ్ సీ.