Maa Oori Polimera 2 Review in Telugu: మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 3, 2023 / 06:57 PM IST

Cast & Crew

  • సత్యం రాజేష్ (Hero)
  • కామాక్షి భాస్కర్ల (Heroine)
  • బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రవివర్మ, రాకేందుమౌళి తదితరులు.. (Cast)
  • అనిల్ విశ్వనాధ్ (Director)
  • గౌర్ కృష్ణ (Producer)
  • జ్ణాని (Music)
  • కె.రమేష్ రెడ్డి (Cinematography)

ఒటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా “మా ఊరి పొలిమేర”. సడన్ గా హాట్ స్టార్ లో రెండేళ్ల క్రితం ప్రత్యక్షమైన ఈ చిత్రం ఎంతోమందిని షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సమాధానం కోసం చాలామంది రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సీక్వెల్ ఎనౌన్స్ చేసేసరికి తెగ సంతోషపడిపోయారు. మరి ఈ సీక్వెల్ ఆ ప్రీక్వెల్ స్థాయిలో ఉందా? అనేది చూద్దాం..!!

కథ: కనిపించకుండాపోయిన కొమరయ్య (సత్యం రాజేష్)ను వెతుక్కుంటూ వెళతాడు జంగయ్య (బాలాదిత్య). అదే సమయంలో జాస్తిపల్లిలో జరిగిన వరుస మరణాల వెనుకున్న అసలు కారణం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు ఎస్.ఐ.రవీంద్రనాయక్ (రాకేందుమౌళి). కట్ చేస్తే.. జాస్తిపల్లి పొలిమేరలోని ఓ మూతవేయబడ్డ గుడి మీద కొందరు పురావస్తు శాఖ అధికారులు సడన్ గా ఆసక్తి చూపించడం మొదలెడతారు.

అసలు పొలిమేరలోని గుడికి, కొమరయ్యకి సంబంధం ఏమిటి? కొమరయ్య ఎక్కడ దాక్కున్నాడు? కొమరయ్యను వెతికే నేపధ్యంలో జంగయ్య ఏం తెలుసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మా ఊరి పొలిమేర 2” కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రీక్వెల్ తరహాలోనే ఈ సీక్వెల్ లోనూ సత్యం రాజేష్ తనదైన నటనతో అబ్బురపరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో రాజేష్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలాదిత్య కూడా తనకు కుదిరినంతలో అలరించడానికి ప్రయత్నించాడు. వీళ్ళందరికంటే ఎక్కువగా అలరించిన వ్యక్తి కామాక్షి భాస్కర్ల. తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ గా రాకేందుమౌళి తన పాత్రకు న్యాయం చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా నైట్ షాట్స్ థియేటర్లో చూస్తున్నప్పుడు బ్రైట్ నెస్ ఇంకాస్త పెంచేతే బాగుండు అనే భావన కలుగుతుంది. నేపధ్య సంగీతం ఓ మేరకు పర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ పరంగాను దర్శకనిర్మాతలు కాస్త ఖర్చు చేస్తే బాగుండేది. థియేట్రికల్ రిలీజ్ అనుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం తమ స్థాయిలో సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది.

దర్శకుడు అనిల్ విశ్వనాధ్ మాత్రం ప్రీక్వెల్ కి వచ్చిన క్రేజ్ ను సీక్వెల్ కు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఇచ్చే వరుస ట్విస్టులు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచాయి. అలాగే.. క్యారెక్టర్ డ్రివెన్ గా సాగించిన ఫస్టాఫ్ అతడి ప్రతిభను ఘనంగా చాటింది. మూడో పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది.

విశ్లేషణ: “పొలిమేర” (Maa Oori Polimera 2) చూసిన ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించే సినిమా “పొలిమేర 2”. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అలరించే ట్విస్టులతో విశేషమైన రీతిలో ఆకట్టుకుంటుందీ చిత్రం. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలుస్తుంది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus