కొత్త వారు ఎవరైనా ఆడిషన్స్ కు వెళ్ళినప్పుడు.. చిత్ర విచిత్రంగా వారికి పరీక్షలు పెడుతుంటారు దర్శకులు. అలా వారి టాలెంట్ ను తెలుసుకుని వారి సినిమాల్లో తగిన క్యారెక్టర్ ను ఇస్తుంటారు. ఇదందరికీ తెలిసిన సంగతే..! అయితే ఓ నటిని మాత్రం ఏకంగా రేప్ సీన్లో పాల్గొనమన్నారట. వెంటనే ఆ హీరోయిన్ అక్కడి నుండీ పారిపోయిందట. విషయంలోకి వెళితే.. బాలీవుడ్ నటి మాన్వి ‘గాగ్రూ’ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న సంఘటనే ఇదట..!
బాలీవుడ్లో హీరో సన్నీ సింగ్ నటించిన ‘ఉజ్డా చమన్’ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాన్వి… ఈ చిత్రంలో బరువు ఎక్కువ ఉన్న అమ్మాయిగా కనిపించి అలరించింది. ‘బట్టతల ఉండే ఓ హీరోని ఇష్టపడే అమ్మాయిగా మాన్వి చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రంతో దర్శకుడు అభిషేక్ పాథక్ మంచి మెసేజ్ ఇచ్చాడనే ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మాన్వి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని చెప్పుకొచ్చింది. “గతంలో సినిమా అవకాశం కోసం ఆడిషన్స్ కు వెళ్ళాను. పరమ చెత్తగా ఉన్న ఆ ఆఫీస్ లో నన్ను రేప్ సీన్ లో నటించమని అడిగారు. అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు.. అక్కడి వాతావరణం చూసి భయంతో పరుగులు తీసాను. ఆ గదిలో ఓ బెడ్ కూడా ఉంది. దాన్ని వాళ్ళ ఆఫీస్ అని చెప్పుకోవడం విచిత్రంగా అనిపించింది.” అంటూ చెప్పుకొచ్చింది.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!