Maar Muntha Chod Chinta Song Review: డబుల్ ఇస్మార్ట్ : ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ రివ్యూ..!
July 16, 2024 / 06:56 PM IST
|Follow Us
‘సోషల్ మీడియాలో వైరల్ అయిన పదాలతో సినిమా పాటలు రావడం’ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. సాహిత్యంతో మెప్పించడం కష్టమవుతుంది అనే వారికి ఇది కొత్త మార్గం అని చెప్పుకోవాలేమో. మొన్నటికి మొన్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయ్యిందో అందరూ చూశారు. యూట్యూబ్లో ఆ పాట 300కి మిలియన్లకు పైగా వ్యూస్ రావడం జరిగింది. అందులోని సాహిత్యంతో సంబంధం లేకుండా కేవలం ‘కుర్చీ మడతపెట్టి’ అనే లైన్ తో ఆ పాటను బాగా ట్రెండ్ చేశారు నెటిజన్లు.
సంక్రాంతి సీజన్ కి వచ్చిన సినిమాల్లోని పాటల్లో అదే టాప్ ప్లేస్ కూడా దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు అదే ట్రెండ్ అనుకున్నాడో ఏమో కానీ.. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా తన సినిమా కోసం కూడా ఓ వైరల్ డైలాగ్ ను వాడుకున్నాడు. లాక్ డౌన్ పడే టైంలో వైన్ షాప్..లు వంటివి బంద్ ఉంటాయి కొన్ని రోజులు అని ఓ జర్నలిస్ట్ పలికితే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఏం చేద్దామంటావ్ మరి’ అంటూ ప్రశ్నించారు.
ఆ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ తో ‘మార్ ముంత చోడ్ చింత’ అనే పాటను క్రియేట్ చేయించారు పూరి. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) నుండి 2 వ లిరికల్ సాంగ్ గా యూట్యూబ్లోకి వచ్చిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) , కీర్తన శర్మ.. యమ హుషారుగా పాడారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. రామ్ (Ram) , కావ్య తప్పర్ (Kavya Thapar) ..లు యమ జోష్ తో ఈ పాటలో చిందులు వేసినట్టు స్పష్టమవుతుంది.
ఇలా విడుదలైన కాసేపటికే ఈ పాట ట్రెండింగ్లోకి వచ్చేసింది. అందుకు కారణం కేసీఆర్ బ్రాండ్ డైలాగ్ అయిన ‘ఏం చేద్దామంటావ్ మరి’ అనే చెప్పాలి. కచ్చితంగా ఈ పాట రాబోయే రోజుల్లో మరింతగా మార్మోగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :