Madhavan: సినిమాలు చేయకపోవడం వల్ల నాలుగేళ్లుగా డబ్బులు లేవు: మాధవన్
May 21, 2022 / 02:10 PM IST
|Follow Us
తమిళ స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. తెలుగులో కూడా ఈయన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన మాధవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా మాధవన్ 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ కేమ్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో భాగంగా మాధవ్ మాట్లాడుతూ తాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వేదికపై విక్రమ్ నటించిన “రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్” అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రముఖ భారత శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాధవన్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని తెలిపారు. ఈ సినిమా కాకుండా తను నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి సినిమాలలో నటించకపోవటం వల్ల తాను ఒక్క రూపాయి కూడా సంపాదించ లేకపోయానని తెలిపారు.
ఇక గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా తాను ఎలాంటి సినిమాలు చేయలేదు. కోవిడ్ రాకముందు రెండు సంవత్సరాల నుంచి కూడా తాను ఎలాంటి సినిమాల్లో నటించకపోవటం వల్ల తనకు సంపాదనలేదని తెలిపారు. ఇలాంటి సమయంలో నెట్ఫ్లిక్స్లో నేను చేసిన డీకపుల్డ్ సిరీస్ నన్ను ఆదుకుంది. నేను చేసిన చివరి సినిమా విక్రమ్ వేద, కాబట్టి ఈ సినిమాపై తాను నిరంతరం భయపడుతూనే ఉన్నానని మాధవన్ తెలిపారు. ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన వ్యక్తులకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది.
వీరికి సినిమా వారికి కన్నా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇలాంటి సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదని మాధవవ్ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే తన దర్శకత్వంలో తెరకెక్కించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్ ఖాన్, సూర్య ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అనంతరం తెలుగు, మలయాళంలో ఈ సినిమా డబ్ కానుందని ఈ సందర్భంగా మాధవన్ తెలిపారు.