ఆంధ్రా ప్రజలకి డబ్బు,కులం మాత్రమే కావాలి అని నిరూపించారు : మాధవీలత
May 27, 2019 / 12:31 PM IST
|Follow Us
సినీ నటి మాధవీలత 2019 ఏపీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరుపున బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమితో తానేమీ బాధపడటం లేదని తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అయితే ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి మాత్రం తనని చాలా బాధించిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు పవన్ అభిమానుల పై కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
మాధవీలత మాట్లాడుతూ.. ”నేను ఓడిపోతానని నాకు ముందే తెలుసు.. పార్టీ కి తెల్సు.. మీకు తెల్సు.. ముందుగానే తెల్సుకొని బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. మొదటి నుండీ చెప్పాను.. ఎక్కడా కూడా నేను గెలుస్తాను అనే మాట వాడలేదు. మోడీ మళ్ళీ రావాలి అనే కోరుకున్నాను… అయన వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డురంగా అనిపిస్తుంది. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము మాకు నిజాయితీ పరులు వద్దు అని బలే చెప్పారు ఆంధ్రా ప్రజలు. నిజంగా పవన్ కళ్యాణ్ ఓటమిని భరించలేకపోతున్నాను, అభిమానులు ఏమయ్యారు..? ఎన్ని మాటలు చెప్పారు ఇదేనా మీ ప్రేమ..? చదువుకున్న వారు రాజకీయంలోకి రావాలి అనేది మీరే..జేడీ లక్ష్మి నారాయణ గారు వచ్చారు? ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి..?డబ్బు కులం కావాలి అని నిరూపించారుగా.. చదువు నీతి వొద్దు అని చెప్పేసారుగా?” అంటూ అందరికీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.