శర్వానంద్ హీరోగా సిద్దార్థ్ 8 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకున్నప్పటికీ కలెక్షన్లను రాబట్టలేక చతికిలపడిపోయింది. మొదటివారానికే ఈ చిత్రాన్ని చాలా థియేటర్స్ నుండీ తొలగించడం జరిగింది.
ఇక క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 2.10 cr |
సీడెడ్ | 1.21 cr |
ఉత్తరాంధ్ర | 0.87 cr |
ఈస్ట్ | 0.48 cr |
వెస్ట్ | 0.39 cr |
గుంటూరు | 0.59 cr |
కృష్ణా | 0.37 cr |
నెల్లూరు | 0.33 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.62 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.96 cr |
‘మహా సముద్రం’ చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.6.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ.9.52 కోట్ల నష్టం వాటిల్లిన్నట్టు అయ్యింది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!