ఆకట్టుకున్న సూపర్ స్టార్, మాటల మాంత్రికుడి కలయికలో వచ్చిన ఫిల్మ్స్

  • November 8, 2016 / 12:53 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రొఫిషనల్ కిల్లర్ గా చూపించి అతని కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరి కలయికలో వచ్చిన మొదటి మూవీ అతడు అద్భుత విజయం సాధించింది. తర్వాత వచ్చిన సినిమా ఖలేజా. ఇందులో ప్రిన్స్ కామెడీ టైమింగ్ కేక. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా మహేష్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ రెండే కాదు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో ఏడు చిత్రాలు కూడా సూపర్ సక్సస్ అయ్యాయి.

ఇప్పటివరకు రెండే కదా వచ్చింది.. మరో ఏడు ఉన్నాయి అంటున్నారు.. కొంపదీసి మహేష్ సినిమాలకు త్రివిక్రమ్ గోస్ట్ డైరక్టర్ గా పని చేశారా? అని అనుకుంటున్నారా ? అదేం లేదండీ. సూపర్ స్టార్ ఏడు వ్యాపార ప్రచార చిత్రాల్ని త్రివిక్రమ్ డైరక్ట్ చేశారు. వీరి కలయికలో ఇదివరకు వచ్చిన రైన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, మహీంద్రా ట్రాక్టర్స్, సంతూర్ సోప్, అమృతాంజన్ పెయిన్ బాంబ్, థమ్స్ అప్, జొస్ అలుక్కాస్ ప్రకటనలు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించిన అభిబస్ యాడ్ ఫిల్మ్ మంచి విజయం సాధించింది. ఆ బస్ టికెట్ పోర్టల్ బాగా క్లిక్ అయింది. మహేష్, మాటల మాంత్రికుడు కలిశారంటే అంతే మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus