స్పైడర్ తమిళ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మహేష్!
August 14, 2017 / 01:08 PM IST
|Follow Us
కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’ ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. ఈనెల 23 నుంచి రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లే. అయితే ఆ పాట షూటింగ్ కి వెళ్లే ముందే డబ్బింగ్ వర్క్ పూర్తి అయ్యే విధంగా చిత్ర బృందం శ్రమిస్తోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ముందుగా తమిళ వెర్షన్ కి డబ్బింగ్ కంప్లీట్ చేయాలనీ మహేష్ ఫిక్స్ అయ్యారు. అందుకే కొన్ని రోజుల క్రితమే డబ్బింగ్ ప్రారంభించారు. చెన్నై స్టూడియోలో జరుగుతున్న డబ్బింగ్ వర్క్ పూర్తి అయ్యే దశలో ఉన్నట్టు సమాచారం.
మహేష్ కి తమిళం పై పట్టు ఉండడంతో తమిళ డైలాగ్స్ ని చకచకా చెబుతున్నట్లు తెలిసింది. అంతేకాదు తాను చెప్పిన డైలాగ్ బాగుందా ? లేదా? అనే విషయాన్నీ ఒకటికి రెండు సార్లు మహేష్ చెక్ చేసుకుంటున్నారని చిత్ర బృందం తెలిపింది. తొలిసారి కోలీవుడ్ లో అడుగు పెట్టబోతుండడంతో మహేష్ స్పైడర్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని వెల్లడించింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.