జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న కొత్త సినిమా స్క్రిప్ట్ వర్కులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం గురించి తాజా సమాచారం ఒకటి బయటికి వచ్చింది. తనకు శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ కు ప్రిన్స్ ఒక కండిషన్ పెట్టినట్లు తెలిసింది. సినిమా షూటింగ్ పక్క ప్లాన్ తో జరగాలని సూచించినట్లు టాక్. ప్రస్తుతం మురుగ దాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో పూర్తి అవుతుంది. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ప్రిన్స్ ఒప్పుకున్నారు.
ఒకటి కొరటాల శివతో, వంశీ పైడిపల్లి డైరక్షన్లో మరొకటి. ఈ రెండు చిత్రాలు ఒకే కాలంలో చేయనున్నారు. అందుకే డేట్స్ క్లాష్ కాకుండా ఉండాలని కొరటాలకు షెడ్యూల్ డేట్స్ ఫిక్స్ చేశారు. జనవరిలో 10 రోజులు, ఫిబ్రవరిలో 15 రోజులు, మార్చిలో మూడు వారాలు కేటాయించారు. ఈ మూడు షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ అయ్యేవిధంగా ప్లాన్ చేసుకోమని కొరటాలకు మహేష్ చెప్పారు. సూపర్ స్టార్ చెప్పిన విధంగానే షూటింగ్ జరిగేలా స్క్రిప్ట్ దశలోనే షెడ్యూల్ కి సెట్ అయ్యే విధంగా కొరటాల ప్లాన్ చేస్తున్నారు. అయితే 2017లో మహేష్ సినిమాలు థియేటర్లలో దూకుడు ప్రదర్శించనున్నాయి.