గతంలో వాణిశ్రీ చీరలు, శ్రీదేవి చీరలు అంటూ వారు సినిమాల్లో ధరించిన మోడల్లో ఉండే చీరలను అభిమానులు ఎగబడి కొనేవారు. అలాగే హీరోలు వేసే షర్ట్, టీ షర్ట్స్ లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇలా హీరో హీరోయిన్స్ ధరించే డిజైన్స్ పై ఈ మధ్య ఆసక్తి తగ్గింది. మళ్ళీ అటువంటి క్రేజ్ ని మహేష్ కాస్ట్యూమ్స్ కి వచ్చింది. ప్రస్తుతం మహేష్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల క్రితం డెహ్రాడూన్ లో మొదలయింది. అక్కడి కాలేజీ లో కొన్ని కాలేజీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు నెట్లో వైరల్ అయ్యాయి.
అందులో మహేష్ వేసుకున్న కాస్ట్యూమ్స్ యువతని బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే అటువంటి చెక్ షర్ట్స్ కోసం అభిమానులు ఇప్పటి ఉంచే వెతికే పనిలో పడ్డారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మోడల్ షర్ట్స్ ట్రెండ్ సృష్టించవచ్చని ఫ్యాషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది.