ప్రయోగాత్మక మూవీ ఘాజీపై ఆసక్తి కనబరిచిన మహేష్ బాబు
February 21, 2017 / 06:45 AM IST
|Follow Us
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘ఘాజీ’ సినిమా గత శుక్రవారం (ఫిబ్రవరి 17 ) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 1971 వ సంవత్సరంలో ఇండియా, పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో సాగే ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ అర్జున్ గా అదరగొట్టారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా .. అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. నిన్నటి వరకు ముంబై లో తన చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రిన్స్ ఈరోజు కడపలోని జమ్మలమడుగుకు వెళ్లారు. అక్కడే మురుగదాస్ కీలక సన్నివేశాన్ని వారం రోజుల్లో తెరకెక్కించనున్నారు. ఇలా తీరిక లేకుండా ఉన్న మహేష్ ఘాజీని ఏ భాషలో చూస్తే బాగుంటుందని ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ మధి ని అడిగారంట.
ఈ సంగతిని అతనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. “ఘాజీ టాక్ విని నాకు మహేష్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. సినిమాను త్వరలోనే చూస్తాను .. అయితే ఏ భాషలో చూస్తే మంచి ఫీల్ వస్తుందని అడిగారు.” అని మధి చెప్పారు. అందుకు సమాధానంగా తాను తెలుగులో ఇది ప్రయోగాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా తెలుగులోనే చూడమని సలహా ఇచ్చానని వివరించారు. మధి శ్రీమంతుడు సినిమాలో డీఓపీ గా పనిచేశారు. ఆ చొరవతోనే మహేష్ మధిని సలహాకోరారు. తోటి ఆర్టిస్టులతోనే కాకుండా టెక్నీషియన్లతోను ఎంతో క్లోజ్ గా మహేష్ ఉంటారనడానికి ఇదే నిదర్శనం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.