Mahesh Babu: ఆ విషయంలో మహేష్ అసంతృప్తితో ఉన్నారా..?

  • May 3, 2021 / 05:42 PM IST

ఈ నెల 1వ తేదీ సాయంత్రం హారిక హాసిని క్రియేషన్స్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఆ సినిమా 2022 సమ్మర్ లో రిలీజ్ కానుందని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రకటనపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు సైలెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. ప్రతి ముఖ్యమైన విషయాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ తో కచ్చితంగా పంచుకుంటారు. అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ట్వీట్ కానీ రీట్వీట్ కానీ చేయకపోవడం గమనార్హం. మహేష్ సైలెన్స్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో మహేష్ అసంతృప్తితో ఉన్నారా..? అనే ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు స్పందిస్తే మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలో మహేష్ పాత్రపై గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అతడు సినిమాలోలా ఈ సినిమాలో కూడా మహేష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే, దిశా పటానీ, జాన్వీ కపూర్ మరి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు ఏ హీరోయిన్ ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus