Keerthy Suresh: మహేష్ నే నమ్ముకున్న కీర్తి.. హిట్టొస్తుందా..?

  • May 24, 2021 / 12:17 PM IST

అందం, అభినయం ఉన్నా ఈ మధ్య కాలంలో సక్సెస్ లేకపోవడంతో కీర్తి సురేష్ కు సినిమాసినిమాకు క్రేజ్ తగ్గుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమాతోనైనా కీర్తి సురేష్ సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తే కీర్తి సురేష్ పాత్ర ఆ సినిమాకు మైనస్ కావడం గమనార్హం. మరోవైపు కీర్తి సురేష్ సినిమాసినిమాకు బరువు తగ్గుతూ ఫ్యాన్స్ కు షాకిస్తున్నారు. కీర్తి సురేష్ మరింత సన్నబడగా మహేష్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

మహానటి సినిమాతో ఎవరూ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటిస్తుండగా బొద్దుగా ఉన్న సమయంలో కీర్తి సురేష్ అందంగా కనిపించేవారని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లుక్స్ పరంగా కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాకు మైనస్ అవుతారేమోనని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట రిజల్ట్ పైనే కీర్తి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

ఈ సినిమా ఫ్లాప్ అయితే కీర్తికి తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో మహేష్ జోరుమీదుండగా గీతాగోవిందం బ్లాక్ బస్టర్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మహేష్ సినిమాపైనే కీర్తి సురేష్ ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ద్వారా ఆమె ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus