Mahesh Babu: సర్కారు వారి పాట దూకుడా..? ఆగడా..?

  • May 25, 2021 / 11:05 AM IST

కెరీర్ తొలినాళ్లలో సీరియస్ సినిమాలలో ఎక్కువగా నటించిన మహేష్ బాబు ఖలేజా సినిమా నుంచి రూటు మార్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సింగిల్ లైన్ పంచ్ లు భలే పేలాయి. ఆ మూవీ ఫ్లాప్ అయినా మహేష్ కొత్తగా కనిపించారనే కామెంట్లు వినిపించాయి. ఆ సినిమా తరువాత దూకుడు సినిమాలో మహేష్ కామెడీ సీన్లను అద్భుతంగా పండించారు. దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కామెడీ సీన్లే కారణమనే సంగతి తెలిసిందే.

ఆయితే ఆగడు సినిమాకు మాత్రం కామెడీ సీన్లే మైనస్ గా మారాయి. అయితే మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కామెడీ ట్రాక్ ఉండబోతుందని సెకండాఫ్ కు కామెడీ ట్రాక్ హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మహేష్ మధ్య ఈ కామెడీ ట్రాక్ రానుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించి రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ గా కనిపించడంతో పాటు లవర్ బాయ్ గా కూడా కనిపిస్తారని తెలుస్తోంది.

మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా సినిమాలో దర్శకుడు ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. అయితే కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సర్కారు వారి పాట దూకుడు అవుతుందా..? లేక ఆగడు అవుతుందా..? అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus