రీల్ లైఫ్ లో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ లోను కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన చివరి నిముషంలో స్టే తెచ్చుకొని కోర్ట్ కి వెళ్లనవసరం లేకుండా చేసుకున్నారు. కోర్టు ఏంటి? స్టే ఏంటి? అనుకుంటున్నారా?.. ఆ వివరాల్లోకి వెళితే.. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చేశారు. ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అయితే ఈ సినిమా కథ తనదంటూ నవల రచయిత శరత్ చంద్ర కోర్టులో కేసువేశారు.
ఆ కేసుని పరిశీలించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి విచారణకు హాజరుకావాలని ఆ చిత్ర డైరక్టర్, నిర్మాతలకు నోటీసులు జారీచేసింది. ఇందులో మహేష్ పేరు కూడా ఉంది. దీంతో ఇరకాటంలో పడిన మహేష్ బాబు హై కోర్టు ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మహేష్ కోర్టుకి హాజరు కావలసిన అవసరం లేదని హైకోర్టు న్యాయస్థానం స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ తో ప్రిన్స్ హమ్మయ్య అనుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.