టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడో సారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి డిఫరెంట్ సినిమాల అనంతరం వీరి కాంబినేషన్లో రాబోతున్న తన సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయిలోనే ఉన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఇదివరకే చాలాసార్లు కథలు మార్పులు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. మహేష్ ఒప్పుకునే వరకు కూడా త్రివిక్రమ్ కథను మారుస్తునే వచ్చాడు. అయితే ఇంతవరకు మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆ ప్రాజెక్టు పై క్లారిటీ అయితే ఇచ్చింది లేదు.
సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని మాత్రమే అప్డేట్ తో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక మహేష్ బాబు ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు మరొక కొత్త న్యూస్ లీక్ అయింది. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమాను మొదలు పెట్టాలని త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ వేశాడు. కానీ పరిస్థితులు ఎంత మాత్రం సపోర్ట్ చేయలేకపోయాయి.ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారు పాటను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది అక్టోబర్ లోపు సర్కారు వారి పాటకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయనున్న మహేష్ బాబు ఆ తర్వాత ఎక్కువగా త్రివిక్రమ్ సినిమా పై ఫోకస్ పెట్టమన్నాడు. ఇక ఆ సినిమా అనంతరం రాజమౌళి సినిమాతో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!