పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రేమ కథా చిత్రం ‘రాధే శ్యామ్’. 1970లలో జరిగే ఓ అందమైన ప్రేమకథగా…. ఇటలీ, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ. ‘రాధే శ్యామ్’ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు, విక్రమాదిత్య ఇంట్రో టీజర్ లకు ప్రేక్షకుల నుండీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘రాధే శ్యామ్’ నెరేటర్‌గా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నట్టు తెలిపింది. అయితే తెలుగు వెర్షన్ ను ఏ స్టార్ హీరో నెరేట్ చేస్తాడు అనే డేట్ అందరిలోనూ ఉంది.దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల రాధే శ్యామ్ యూనిట్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఈ విషయమై సంభాషించడం జరిగింది.అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పవన్ కి కుదరకపోతే మహేష్ బాబు.. రాధే శ్యామ్ కు నెరేటర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో మహేష్ కు మంచి అనుభవం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్ షా వంటి పెద్ద సినిమాలకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
వాటికి మంచి రెస్పాన్స్ లభించింది కూడా..! కాబట్టి రాధే శ్యామ్ తెలుగు వెర్షన్ కి మహేష్ కూడా బెస్ట్ ఆప్షనే..! కానీ అతను ఓకె చెబుతాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!