వయస్సు పెరిగినా యంగ్ గా కనిపించే హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లోని సినిమాలో కూడా మహేష్ నటించనున్నారు. అయితే ట్విట్టర్ స్పేస్ లో కూడా మహేష్ బాబు రికార్డులు క్రియేట్ చేశారని తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ను విన్న ట్విట్టర్ స్పేస్ లిజనర్స్ సంఖ్య 14,900గా ఉంది.
ఆచార్య టీజర్ ను 4600 మంది ట్విట్టర్ స్పేస్ లిజనర్స్ వినగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను 4000 మంది విన్నారు. ఈ విధంగా మహేష్ ట్విట్టర్ స్పేస్ లో కూడా అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. యూట్యూబ్ లో భీమ్లా నాయక్ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుండగా ట్విట్టర్ స్పేస్ లో మాత్రం మహేష్ ముందంజలో ఉండటం గమనార్హం. అయితే భీమ్లా నాయక్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.
పవన్ కెరీర్ లోని బెస్ట్ టైటిల్ సాంగ్స్ లో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కూడా ఒకటని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మరోవైపు సంక్రాంతి పండుగ కానుకగా భీమ్లా నాయక్, సర్కారు వారి పాట ఒక్క రోజు తేడాతో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!