నిర్మాత ‘ప్లాన్’తో ప్రిన్స్ షాక్..!

  • April 11, 2016 / 09:29 AM IST

సర్దార్ గబర్ సింగ్ పుణ్యమా అంటూ ఇప్పుడు అందరు నిర్మాతలు కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఆ కోవలోకే వస్తాడు మన ప్రిన్స్ బ్రహ్మోత్సవం నిర్మాత. ఇంతకీ విషయం ఏమిటి అంటే ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త కుటుంభ కధ ఆధారంగా, తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే చిత్రం విడుదల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు నిర్మాత. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ చూశాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇంతకీ ఏంటో ఆ నిర్ణయం అంటే…బ్రహ్మోత్సవం మూవీని తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ రెండు బాషల్లోనే కాకుండా హిందీలో సైతం ఈ చిత్రాన్ని విడుదల చేసి సేఫ్ జోన్ లో ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు నిర్మాత. అందుకోసం ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఇక మరో పక్క ఎట్టి పరిస్థితుల్లో పవన్ సర్దార్ ఫర్స్ట్ డేస్ కలెక్షన్స్ కు చెక్ పెట్టేందుకు కోలీవుడ్ మార్కెట్ ని క్యాష్ చేసుకునేందుకు, తమిళనాడులో ఈ మూవీని దాదాపు 900కి పైగా థియోటర్స్ లో రిలీజ్ చేస్తున్నారంట. ఇక బాలీవుడ్ లో సైతం 200 థియోటర్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓవెర్సీస్ విషయానికి వస్తే ప్రిన్స్ క్యాలిబర్ తెలిసిందే. అందుకే రకరకాల పద్దతుల్లో ఈ సినిమాలు విడుదల చేసి టాప్ హిట్ గా నిలపాలని నిర్మాత చేస్తున్న ప్ల్యాన్స్ చూసి మహేష్ షాక్ తిన్నడంటా. మరి ఎలా చూసినా సినిమా హిట్ అన్న మాటే వినిపించేలా ఆ రివ్యూ రాసే వాళ్ళను కూడా కొనెస్తే సినిమాకు తిరుగు ఉండదేమో…ఆలోచించండి నిర్మాత సారు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus