Goutham: ఆ విషయంలో గౌతమ్ నిజంగా గ్రేట్.. చిన్నారుల కోసం అలా చేస్తూ?
August 29, 2023 / 03:33 PM IST
|Follow Us
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సేవా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హార్ట్ ఆపరేషన్లు చేయించడం ద్వారా 1000 కంటే ఎక్కువ మంది చిన్నారులకు మహేష్ బాబు ప్రాణం పోశారు. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా ఏకంగా 225 కోట్ల రూపాయలు అని భోగట్టా. అయితే మహేష్ బాబు తనయుడు గౌతమ్ మహేష్ బాటలో నడుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
గౌతమ్ (Goutham) గోల్డెన్ హార్ట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నమ్రత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ ఫౌండేషన్ తరపున గౌతమ్ చికిత్స పొందుతున్న చిన్నారులతో ముచ్చటించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నమ్రత తన పోస్ట్ లో చిల్డ్రన్ ఆస్పత్రికి గౌతమ్ ఎప్పుడూ వస్తుంటారని ఇప్పుడు ఈ విధంగా వచ్చి గౌతమ్ ఆస్పత్రిని సందర్శించారని తెలిపారు.
రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రి, ఎంబీ ఫౌండేషన్ కలిసి ఈ విధంగా చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాయని నమ్రత చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ కూడా భాగస్వామి అని నమ్రత కామెంట్లు చేయడం గమనార్హం. కార్డియో వార్డుల్లో, ఆంకాలజీ వార్డుల్లో గౌతమ్ పిల్లలతో కలిసి ముచ్చటించారని నమ్రత పేర్కొన్నారు. గౌతమ్ పిల్లలతో ముచ్చటించి వాళ్ల ముఖంలో నవ్వు తెప్పించారని నమ్రత కామెంట్లు చేశారు.
ఆ చిన్నారులకు నయమవుతుందని గౌతమ్ భరోసా ఇచ్చారని నమ్రత అభిప్రాయం వ్యక్తం చేశారు. నమ్రత షేర్ చేసిన పోస్ట్ కు లక్ష కంటే ఎక్కువగా లైక్స్ వచ్చాయి. గౌతమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది. గౌతమ్ సినిమాల్లోకి వస్తే సక్సెస్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.