‘మహేష్’ని టచ్ చెయ్యడం అంత ఈజీ కాదు!!

  • August 4, 2017 / 06:44 AM IST

ప్రిన్స్ మహేష్ బాబు…వరుసగా మంచి హిట్స్ ఇస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్న తరుణంలో బ్రహ్మోత్సవం డిజస్టెర్ గా నిలవడం ఒక్కసారిగా ఉలిక్కిపాడ్డారు ప్రిన్స్ ఫాన్స్ అంతా…కట్ చేస్తే ప్రిన్స్ తన ఫాన్స్ ను ఎలా అయినా హ్యాపీ చెయ్యాలి అన్న ఆలోచనతో భారీ బడ్జెట్ సినిమాతో, ఇటు తెలుగు, అటు తమిళం రెండు భాషల్లో చెలరేగిపోయేందుకు వస్తున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా అనౌన్స్ చేసిన తొలి రోజుల్లో కాస్త సందిగ్ధంలో ఉన్న ప్రిన్స్ ఫాన్స్…పోనూ…పోనూ మంచి సంచలనాలనే క్రియేట్ చేసేలా దూసుకుపోతుంది అన్న నమ్మకంతో ఉన్నారు….దానికి కారణం సినిమా ప్రీ రిలీజ్ హంగామా సంచలనంగా మారడమే. అంటే కాదు ఓవర్సీస్ లో మహేష్ సత్తా మరోసారి ప్రూవ్ చేసింది స్పైడర్ మూవీ. ఎలా అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి, మిలియన్ మార్క్ ను అవలీలగా దాటే మహేష్ సినిమాలు తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా సరే అక్కడ మాత్రం నిర్మాతలకు లాభాలు తెప్పించేస్తాయి అని ఒప్పుకోక తప్పదు.

దానికి ఉదాహరణగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా నిలిచినా సరే ఓవర్సీస్ లో స్పైడర్ సంచలనాలు సృష్టిస్తుంది…దానికి నిదర్శనం అక్కడ స్పైడర్ సినిమాను 15.2 కోట్లకు కొనడమే….ఈ ఒక్క మ్యాటర్ చాలు మహేష్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 200 కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది. బాహుబలి బిగినింగ్ తర్వాత నాన్ బాహుబలి రికార్డులన్ని తిరగరాసిన మహేష్ మరోసారి అదే తరహాలో బాహుబలి-2 తర్వాత నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే ప్రిన్స్ సినిమా రికార్డుల ప్రకంపనలు సృష్టిస్తుంది అని ఇట్టే అర్ధం అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus