Mahesh Babu: ‘ఆచార్య’ లో మహేష్ పాత్ర.. చిరు మంచి పని చేశారు..!
April 29, 2022 / 07:53 PM IST
|Follow Us
‘ఆచార్య’ చిత్రంలో మహేష్ బాబు కూడా భాగమయ్యాడు. ఈ సినిమాలో ‘ధర్మస్థలి’ ని ప్రేక్షకులకు పరిచయం చేసేది మహేషే..! సినిమా మొదలైన రెండు నిమిషాల పాటు మహేష్ వాయిస్ ఉంటుంది. మహేష్ చెప్పే వాయిస్ ఓవర్ విన్న వాళ్ళకి సినిమా అర్ధమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి పక్కన పెట్టేస్తే… ‘ఆచార్య’ లో మహేష్ ఇలా భాగం అయ్యాడు కానీ నిజానికి ఆయన నటించాల్సి కూడా ఉంది. రాంచరణ్ చేసిన సిద్ద పాత్రకి మొదట మహేష్ ను అనుకున్నాడు కొరటాల శివ.
ఆ పాత్ర నిడివి కేవలం 15 నిమిషాల వరకు మాత్రమే అనుకున్నాడు. కానీ మహేష్ ను కాదని చిరు.. చరణ్ ను తీసుకోమన్నారు. అంతేకాకుండా చరణ్ పాత్ర నిడివి కూడా పెంచమని చెప్పారు. అది అలా 1 గంట వరకు వచ్చేసింది. చరణ్ పాత్ర సినిమాలో చాలా కీలకం అన్నారు. కానీ అతని పాత్ర కూడా సినిమాని కాపాడలేకపోయింది. అయితే చిరు ఏ ఉద్దేశంతో మహేష్ పాత్రని వద్దన్నారో కానీ.. అది మహేష్ చేయకపోవడమే మంచిదైంది.
లేదంటే మెగా అభిమానులు హర్ట్ అయినట్టు మహేష్ అభిమానులు కూడా హర్ట్ అయ్యేవారు. ఇంకో విషయం ఏంటంటే చరణ్ పాత్ర నిడివి పెంచడం వల్లనే చిరుకి జోడీగా చేయాల్సిన కాజల్ పాత్రని తొలగించినట్టు ఇన్సైడ్ టాక్.హీరోయిన్ లేకపోవడం వలన చిరు మార్క్ కామెడీ ఇందులో మిస్ అయ్యింది. ఈ విషయమై కొరటాల శివ పై కాజల్ ఫైర్ అయినట్టు కూడా సమాచారం. ఇంకో రకంగా చూసుకుంటే చరణ్ పాత్ర ఉండడం వల్లనే చిరు కంఫర్ట్ గా నటించారు. వేరే హీరో అయితే ఆయన రెండు రకాలుగా ఇబ్బంది పడేవారు.