వివి వినాయక్ దర్శకత్వంలో నటించనున్న మహేష్ బాబు

  • November 24, 2017 / 01:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించనున్నారా? .. మాస్ కథలో అలరించడానికి సిద్దమవుతున్నారా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. స్పైడర్ తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాను పట్టాలెక్కించారు. ఇది వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు.

మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కానున్న ఈ ప్రాజక్ట్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మహేష్ 26 సినిమాకి స్టోరీ ఫైనల్ అయినట్టు సమాచారం. వివి వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల వారు తెలిపారు. అయితే ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది మహేష్ డేట్స్ మొత్తం ఫుల్ కావడంతో 2019 సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చారని.. ఎప్పుడైనా తీయడానికి తాను సిద్ధమని వినాయక్ చెప్పినట్లు వార్తలు షికారు చేస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఓ యువ హీరోతో మూవీ ఒప్పుకున్నారు. ఈ రెండు తర్వాత మహేష్ ని పూర్తి మాస్ గా చూపించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus