పంచె కట్టుతో అదరగొట్టనున్న మహేష్

  • December 23, 2017 / 02:08 PM IST

పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు లుంగీ కట్టి స్టెప్పులు అదరగొట్టారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలో ఓ పాటలో లుంగీ కట్టి నడుచుకుంటూ వస్తారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ లుంగీలో కనిపించి హిట్ అందుకోబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. మహేష్ పై పంచెకట్టుతో ఓ పాట తీయాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ‘‘ పోకిరి.. శ్రీమంతుడు రెండు సినిమాల్లోనూ మహేష్ లుంగీతో కనిపించిన పాటలు మాస్ కు తెగనచ్చేశాయి.

ఇప్పుడు పంచెకట్టుతో కనిపించడం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది.” అని చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఈ ప్రపోజల్ ఇంకా మహేష్ కి చెప్పలేదంట. అయితే మహేష్ కచ్చితంగా ఓకే చెబుతాడని డైరెక్టర్ నమ్మకంతో ఉన్నారని తెలిసింది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27 థియేటర్లోకి రానుంది. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus