మహర్షి సినిమాని భారీ ధరకి కొనేందుకు భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్స్
December 11, 2018 / 02:15 PM IST
|Follow Us
స్టార్ హీరోల సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోలకి పెద్దగా సమస్యేమీ ఉండదు. దర్శకులు, నిర్మాతలకంటే ఎక్కువగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్సే. సినిమా హిట్టైతే వాళ్ళకి భారీ స్థాయిలో లాభాలు వస్తాయో లేదో తెలియదు కానీ.. నష్టాలు మాత్రం కన్ఫర్మ్. ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంగతి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాపం తెలుగు రాష్ట్రాల్లో సదరు హీరోల స్టార్ డమ్ చూసి భారీ మొత్తానికి వారి సినిమా ఓవర్సీస్ రైట్స్ ను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా దారుణమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” కొన్నది 11 కోట్లకైతే.. వచ్చింది 5 కోట్లు, “స్పైడర్’ 14 కోట్లకి కొనుగోలు చేయగా ఇప్పటివరకూ నిర్మాతలకు వచ్చింది 5 కోట్లు మాత్రమే. మునుపటి చిత్రం “భరత్ అనే నేను” మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ విధంగా ఆడింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు “మహర్షి” సినిమాపై పడింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కు దిల్ రాజు అండ్ బ్యాచ్ భారీ మొత్తాన్ని కోట్ చేయగా.. ఆ మొత్తానికి మహర్షి సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా లేరు. దాంతో ఏప్రిల్ లో విడుదలకు రెడీగా ఉన్న మహర్షి సినిమాకు ఇప్పటివరకూ ఓవర్సీస్ బిజినెస్ ఫినిష్ అవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.