Mahesh Babu: అది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుందా..? : మహేష్

  • September 15, 2021 / 04:34 PM IST

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన కూతుళ్లు సురక్షితమేనా..? అనేది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా..! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఃఖంలో మునిగిపోయిందో ఊహించలేం. ఈ కేసులో నిందితులకు శిక్షించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు”. మరోపక్క హీరో మంచు మనోజ్ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

చిన్న కుటుంబాన్ని మంగళవారం నాడు పరామర్శించిన మనోజ్.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపునిచ్చాడు. ఈ విషయంలో మీడియాను కూడా ఎండగట్టారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కవరేజ్ పై పెట్టిన ఫోకస్ ఇలాంటి కేసులపై పెట్టాలని సూచించారు. కాగా.. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉన్నాడు.

ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus