“నాగ్” తో మహేష్ “ఫోన్” కాల్ వివరాలు

  • March 28, 2016 / 09:01 AM IST

టాలీవుడ్ లో ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున. అయితే తాజాగా ఆయన తీసిన ఊపిరి సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ…నాగ్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఇక నాగ్ కుమారుడు అఖిల్ అయితే తొలుత ఈ సినిమాలోని పాత్రను చెయ్యవద్దు అని చెప్పి, ఆ తరువాత సినిమా హిట్ అయిన వెంటనే నాన్నకు క్షమాపణ సైతం చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేసాడు ప్రిన్స్ మహేష్. అదీ నాగ్ కు ఫోన్ చేసి మరీ..

.అయితే ఇప్పుడు అదే ఫోన్ కాల్ మ్యాటర్ టాలీవుడ్ లో టాక్ ఒఫ్ ద టౌన్ గా మారింది. ఇంతకీ మహేష్ కాల్ చేసి ఏం చెప్పాడు..,అంటే…దాదాపుగా 20నిమిషాలు కాల్ లో మాట్లాడిన మహేష్, సినిమా ఛా బాగా ఉంది అని.. మీలాంటి వారు ఇలాంటి పాత్రలు చేయడం వల్ల తమకు చాలా ఆదర్శం కలుగుతుందని.. మీరు ఇలా చేస్తే మేమెం చేసేది అన్నట్టు సరదా సంభాషణలు జరిపాడట మహేష్. ఊపిరి చూసి తన ట్విట్టర్లో టీం అందరికి కంగ్రాట్స్ చెప్పి విష్ చేసిన మహేష్ ఇంకా సినిమా గురించి తన ఆనందాన్ని నాగ్ తో ఫోన్ కాల్ ద్వారా పంచుకున్నారట. అలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా టాలీవుడ్ లో హాట్  టాపిక్ గా మారడంతో అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. ఎంతైనా ప్రిన్స్…..అన్న మాటకి జస్టిఫికేషన్ ఇచ్చాడు మన మహేష్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus