కొరటాల శివ, మహేష్ కొత్త మూవీ థీమ్!

  • September 8, 2016 / 07:58 AM IST

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. తండ్రి కల నెరవేర్చాలి, భార్యకు మంచి భర్తనవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చాలా మంది తమ కోసం సమయాన్ని కేటాయించుకోవడం లేదు. డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు. సమయానికి ఆహారం కూడా తినక అనారోగ్యం పాలవుతున్నారు. ఇదే అంశాన్ని కథగా ఎంచుకున్నారు కొరటాల శివ. అయన గత సినిమాల మాదిరి గానే నాలుగో చిత్రంలోను ఓ మెసేజ్ ని అందించనున్నారు.

“నిన్ను నువ్వు ప్రేమించుకో” అనే సందేశాన్ని ఇవ్వనున్నారు. డైరక్టర్ ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబు కి చెప్పడం, అయన ఓకే చెప్పడం కూడా జరిగి పోయింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు కంటే ఇందులో హాస్యం ఎక్కువగా ఉంటుందని, మహేష్ “నేను.. నా జీవితం” అంటూ భలే నవ్విస్తాడని సమాచారం. జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న కొరటాల కొత్త సినిమా స్క్రిప్ట్ వర్కులో బిజీ కానున్నారు. ప్రస్తుతం మురుగ దాస్ దర్శకత్వంలో  ప్రిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో పూర్తి అవుతుంది. దీని తర్వాత వచ్చే ఏడాదిలో కొరటాల, మహేష్ సినిమా మొదలుకానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus