విద్యార్థిలా శ్రద్ధగా విని, పాటిస్తున్న సూపర్ స్టార్

  • September 20, 2016 / 10:09 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అండర్ కాప్ గా నటించిన పోకిరి బ్లాక్ బస్టర్ అయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రిన్స్ దూకుడులో కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్ ఆఫీసర్ గా అదరగొట్టనున్నారు. అందుకోసం సూపర్ స్టార్ స్టూడెంట్ గా మారారని తెలిసింది. ఇంటలిజెన్స్ లో పని చేసేవారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?, వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు?, ఫిట్ నెస్ రహస్యాలు.. అన్నింటిని ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న వారి వద్ద నుంచి తెలుసుకున్నారని సమాచారం.

పాఠాలు శ్రద్ధగా వినడమే కాదు వాటిని పాటిస్తున్నారు. కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న మూవీ ప్రస్తుతం చెన్నైలో ఈవీపీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పక్కా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ తన పాత్రకు ప్రాణం పోస్తున్నారు. తాజా గా సూపర్ స్టార్ హోమ్ వర్క్ గురించి తెలిసిన చిత్ర బృందం ఆశ్చర్యపోతున్నారంట. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నా, పాత్ర విషయంలో క్లాసులు తీసుకోవడం చూస్తుంటే నేటి యువ హీరోలు ఆయన వద్ద నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus