ప్రిన్స్, మురుగదాస్ కాంబినేషన్ మూవీకి టైటిల్ ఫిక్స్

  • October 17, 2016 / 08:10 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గత వారం రోజులుగా హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై ఛేజింగ్ సీన్ షూటింగ్ చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. లొకేషన్ కు సంబంధించిన ఫొటోను సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ దీపావళికి రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మొదట్లో వాస్కోడిగామా, హంటర్, అభిమన్యుడు పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరకు ఏజెంట్ శివ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అభిమానుల సలహా మేరకు మహేష్ సినిమా టైటిల్ లో మార్పు చేసినట్లు టాక్. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ సరసన ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus