పండుగ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేయనున్న సూపర్ స్టార్

  • October 18, 2016 / 01:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దీపావళికి షాక్ ఇవ్వనున్నారు. పండుగకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించనున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరక్షన్లో తెరకెక్కుతున్న షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పది రోజులుగా  హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై  ఛేజింగ్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

స్పెషల్ పోలీస్ గా  ప్రిన్స్ లుక్ ని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, పది సెకన్ల టీజర్ కూడా దీపావళికి రిలీజ్ చేయాలనీ మహేష్ బాబు భావిస్తున్నారు. ఇందుకోసం మురుగదాస్ బృందం టీజర్ కట్ లో నిమగ్నమైంది. ఆ విజువల్స్ కి అదిరిపోయే రీ రికార్డింగ్ ఇవ్వడానికి హరీష్ జయరాజ్ శ్రమిస్తున్నారు. సూపర్ స్టార్ సరసన  ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus