ఫస్ట్ లుక్ తేదీ ఖరారు చేసిన మురుగదాస్ బృందం

  • October 3, 2016 / 10:20 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై  మూడో  షెడ్యూల్  ఛేజింగ్ సీన్ షూటింగ్ చేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. స్పెషల్ పోలీస్ గా ప్రిన్స్ లుక్ ని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఈ నెలలో తీరనుంది.

సూపర్ స్టార్ సరసన  ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని దీపావళికి రిలీజ్ చేయాలనీ మురుగదాస్ బృందం ఫిక్స్ అయింది. ఈ పండుగ తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలకు ఎంతో సెంటిమెంట్ రోజూ కావడంతో తమిళం, తెలుగు రెండు పోస్టర్ లను అప్పుడే విడుదల చేయాలని డైరక్టర్ భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus