మురుగ దాస్ కి ఇష్టమైన రోజునే ఈ వేడుక!

  • September 14, 2016 / 05:52 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఈ నెల 7 నుంచి 23 వరకు రెండవ షెడ్యూల్ కొనసాగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోని మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే డేట్ ఫిక్స్ అయింది. దీపావళి కి రిలీజ్ చేయాలని దర్శకుడు శ్రమిస్తున్నారు.

ఆ రోజే ఎందుకని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం బయటి పడింది. కోలీవుడ్ లో దీపావళి రోజు బిగ్ స్టార్స్ చిత్రాల ఫస్ట్ లుక్, సినిమాలను రిలీజ్ చేయడం ఆనవాయితీ అని తెలిసింది. ఆ రోజంటే మురుగదాస్ కి చాలా ఇష్టమంట. మహేష్ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది, అందుకే ఫస్ట్ లుక్ ని దీపావళికి ఎలాగైనా విడుదల చేయాలని మురుగ దాస్ చిత్ర బృందానికి సూచించినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు అభిమానులకు ఆరోజు రెండు పండుగలన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus