ప్రిన్స్, మురుగదాస్ కాంబినేషన్ మూవీకి టైటిల్ ఫిక్స్
December 10, 2016 / 10:12 AM IST
|Follow Us
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మొదట్లో వాస్కోడిగామా, హంటర్, అభిమన్యుడు పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరకు “సంభవామి” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పేరుని డిసైడ్ చేయడం వెనుక చాల పెద్ద స్టోరీ ఉంది. గతంలో మహేష్ నటించిన అర్జున్ “మూవీలో ఒక్క మాట.. ఒక్క బాణం.. ఒక్కటే గురి” అనే పాటకు ముందు “సంభవామి” అనే పదం వినిపిస్తుంది.
“సంభవామి” అనే పదానికి నేను అవతరిస్తాను అని అర్ధం. దీని పూర్తి వాఖ్యం అర్ధం తెలుసుకుంటే మాత్రం .. ” సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతియుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను.” అని అర్ధం. భగవద్గీతలో అర్జునికి శ్రీకృష్ణుడు ఇలా భోదిస్తాడు. అంటే మహేష్ ఇందులో శ్రీకృష్ణుడి మరో అవతారంగా చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇది సంస్కృతి పదం కావడంతో తమిళంలోనూ ఇదే టైటిల్ ఉంటుంది. ఈ పేరుని అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ సరసన ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.