విభిన్న అవతారాల్లో కనిపించనున్న సూపర్ స్టార్

  • October 27, 2016 / 05:19 AM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గురించి తాజాగా ఒక ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మంలోని కొత్తగూడెం లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో సూపర్ స్టార్ లోని అనేక షేడ్స్ ని డైరక్టర్ మనకి చూపించనున్నారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ విభిన్న అవతారాల్లో కనిపించనున్నట్లు తెలిసింది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  ప్రిన్స్ పాత్రను ఆసక్తి కలిగించేలా మురుగదాస్ మలిచారని సమాచారం.

జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, విలన్ ఎస్.జె.సూర్య ల మధ్య వచ్చే సీన్లు హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus