మహేష్, ప్రభాస్ గురించి వారి చెల్లెల్లు ఏమన్నారంటే ?
August 7, 2017 / 07:53 AM IST
|Follow Us
నేడు రక్షాబంధనాన్ని అందరూ వైభవంగా చేసుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి ఆశీర్వదిస్తున్నారు.. ఆశీస్సులు అందుకుంటున్నారు. ఇదే సందడి మన స్టార్ హీరోస్ ఇళ్లల్లో కూడా ఉంది. ఈ సందర్భంగా మహేష్, ప్రభాస్ చెల్లెళ్లను అన్నల గురించి చెప్పమని అడిగితే పర్ఫెట్ అంటున్నారు. ”ప్రభాస్ మాకు సొంత అన్నయ్య కాకపోయినా.. మేము అలాగే భావిస్తాం. హీ ఈజ్ రెబల్ స్టార్. మాకు కూల్ స్టార్” అని సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి చెప్పారు. వీరు రెబల్ స్టార్ కృష్ణంరాజు ముద్దుల కుమార్తెలు. ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. తమ అన్నయ్య పెళ్ళికి భలే సందడి చేస్తామని ఇప్పుడు నుంచే ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇక మహేష్ చెల్లెలు ప్రియదర్శని తన అన్నల గురించి వివరిస్తూ.. “రమేశ్ అన్నయ్య నాకు నాన్నలా. నానీ (మహేశ్) ఫ్రెండ్‌లా ఉంటారు.
రమేశ్ అన్నయ్యను నాన్న అని ఎందుకు అన్నానంటే మా చిన్నప్పుడు నాన్నగారు (కృష్ణ) మాకు పాకెట్ మనీ ఇస్తే, రమేశ్ అన్నయ్య తన మనీనంతా నాకోసం ఖర్చు పెట్టేవాడు. నానీని ఫ్రెండ్ అని ఎందుకు అన్నానంటే, ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలుంటాయి కదా. అలా చిన్నప్పుడు మేమిద్దరం గొడవపడేవాళ్లం. ఆ గొడవలు తల్చుకుంటే నవ్వొస్తోంది.” అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ “మహేష్ అన్నయ్యలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే ఇంట్లో ఆడవాళ్లను ఒకలా బయటివాళ్లను ఒకలా నానీ చూడడు. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు” అని చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.