భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం శ్రమిస్తున్న సూపర్ స్టార్

  • October 17, 2016 / 01:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చేస్తుంటారు. ఎంత రిస్క్ అయినా వెనుకడుగు వేయరు. అదే ఆలోచనలు కలిగిన డైరక్టర్ మురుగదాస్. ఫైట్స్ ని కొత్తగా చూపించడంలో ఈ డైరక్టర్ దిట్ట. సో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ సీన్లే తీసినట్లు తెలిసింది. మొదటి షెడ్యూల్ లో రాత్రివేళ ఫైట్.. రెండో షెడ్యూల్ చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్.. ఇప్పుడు జరుగుతున్న మూడు షెడ్యూల్ లో మొన్ననే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద  వర్షంలో ఫైట్ చిత్రీకరించారు.

రెండు రోజులుగా నగరంలో ప్రధాన రహదారుల్లో ఛేజింగ్ సీన్ షూటింగ్ చేస్తున్నారు. వరుసగా యాక్షన్ సీన్లలో పాల్గొంటూ మహేష్ అలసి పోతున్నారంట. కష్టంగా అనిపిస్తున్నా డైరక్టర్ కోరిన విధంగా ప్రిన్స్ నటిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది.  ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో మహేష్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ కనిపించనున్నారు. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నఈ సినిమా  ఫస్ట్ లుక్ టీజర్  దీపావళికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus