మహేష్ 23 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్, టైమ్ ఖరారు చేసిన మురుగదాస్

  • April 10, 2017 / 01:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 23 మూవీ మొదలయినప్పటినుంచి చిత్ర బృందం కొనసాగిస్తున్న సస్పెన్స్ కి రెండు రోజుల్లో తెరపడనుంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులు నాలుగునెలలుగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి, రిపబ్లిక్ డే, శివ రాత్రి, ఉగాది, శ్రీరామనవమి ప్రతి పండుగనాడు వస్తుందని ఫ్యాన్స్ ఆశించడం.. నిరాశ చెందడం అలవాటు అయిపోయింది. ఫ్యాన్స్ కి  మహేష్ క్షమాపణలు చెప్పినప్పటికీ వారు శాంతించలేదు. సో డైరక్టర్ ఇక ఆలస్యం చేయకుండా ఈ నెల 12 వ తేదీన సాయంత్రం 5 గంటలకు లుక్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఈరోజు ప్రకటించారు.

అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది. ప్రస్తుతం మురుగదాస్ బృందం చెన్నై లో ఉంది. అక్కడ మహేష్, ఎస్.జె. సూర్య లపై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ రేపటితో పూర్తి అవుతుంది. ఆ తర్వాత 12 ఫస్ట్ లుక్ రిలీజ్,  ఏప్రిల్ 14 తమిళ సంవత్సరాదిని జరుపుకొని 15 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus