స్టోరీ సిట్టింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లిన మహేష్, కొరటాల
February 3, 2017 / 07:32 AM IST
|Follow Us
హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కలయికలో రానున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా కొరటాల స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ స్క్రిప్ట్ పై డిస్కషన్ నిర్వహించడానికి హీరో, డైరక్టర్ నిన్న బ్యాంకాక్ వెళ్లారు. మహేష్ బాబు జనవరి 7 నుంచి 30 దాకా హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు.
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబై లో ఈనెల 11న ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో తర్వాత చేయనున్న మూవీ కథ ఫైనల్ చేయడానికి మహేష్ పయనమయ్యారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ సెప్టెంబర్ 22 వ తేదీన విడుదల చేయాలనీ భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.