Mahi V Raghav: ఎన్నికల కోసం జగన్‌ సినిమా రెడీ అవుతోంది? ఏపీ పాలిటిక్స్‌ ఎలా మారుతాయో?

  • July 11, 2023 / 01:14 AM IST

సినిమాలు – రాజకీయాలు ఈ బంధం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఉంది, ఉంటుంది కూడా. రాజకీయాలను సినిమాల్లో చూపించి ఎన్నికల్లో వాడుకోవాలని అనుకుంటారు పొలిటీషియన్స్‌. సినిమాల్లో రాజకీయాలు చేసి వాడుకునేవాళ్లు కూడా ఉన్నారు కూడా. అయితే ఈ రెండు సందర్భాల్లో ఏదీ చెప్పి చేయరు. అన్యాపదేశంగా అంటారు తప్ప. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఇదే జరిగింది. అయితే ‘యాత్ర 2’ సినిమా విషయంలో దర్శకుడు చాలా క్లియర్‌గా పొలిటికల్‌ ఇన్‌టెన్షన్‌ చెప్పేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కించింది. ఆయన యాత్రలో చేసిన పనులు, మాట్లాడిన విషయాలు, సినిమాటిక్‌ సీన్స్‌ కలబోతగా దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కించారు. ఆ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డిగా మమ్ముట్టి అదరగొట్టారు. దానికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ వస్తుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు మోషన్‌ పోస్టర్‌ ద్వారా సినిమాను అఫీషియల్‌ అనౌన్స్‌ చేశారు. ఏ టైమ్‌లో ఈ సినిమా నడవబోతోంది అని కూడా చెప్పారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంగా ఆధారంగా తీయబోయే ‘యాత్ర 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. అందుకే వైఎస్‌ జయంతి రోజు అఫీషియల్‌గా ప్రకటించేశారు. 2009 నుండి 2019 వరకు జగన్‌ జీవితంలో జరిగిన విషయాలను ఈ సినిమాలో చూపిస్తామని దర్శకుడు మహి. వి. రాఘవ్‌ తెలిపారు. సినిమాపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని చెప్పిన మహి వి రాఘవ్‌… రాజకీయం కోసం ఈ సినిమా చేస్తున్నారా? అనే ప్రశ్నకు డేరింగ్‌ ఆన్సర్‌ ఇచ్చారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా వస్తుదా? అని అడిగితే అలాంటి సమాధానమే ఇచ్చారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. ‘‘ఆంధ్ర ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దు. ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు. జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే ఈ సినిమాలో చూపిస్తాం. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్..

ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మనం ఏది చెప్పినా నమ్మేవాళ్లు నమ్ముతారు నమ్మని వాళ్లు నమ్మరు. అందుకే ఈ సినిమాను వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకోనివ్వండి’’ అంటూ బోల్డ్‌గా ఆన్సర్‌ ఇచ్చారు మహి వి రాఘవ్‌. అయితే, ఏపీలో ఇప్పుడు పరిస్థితుల్లో ఇలా సినిమా చేసి ఎన్నికలకు వెళ్లడం అంతసరికాదు. ఒక పార్టీకి అనుకూలంగా తెరకెక్కిస్తున్నాం అని (Mahi V Raghav) దర్శకుడు ఓపెన్‌గా చెబితే.. ఏపీలో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus