Bimbisara Movie: ‘బింబిసార’లో అదే మెయిన్ హైలైట్!

  • May 29, 2021 / 02:49 PM IST

శుక్రవారం సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. అదే ‘బింబిసార’. వశిష్ట్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ ని వదిలారు. దీన్ని బట్టి చరిత్రలోకి వెళ్లి ఒక అన్ టోల్డ్ స్టోరీను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ కూరమైన సైనికాధిపతి గెటప్ లో కనిపించారు.

అయితే సినిమా మొత్తం ఇదే లుక్ లో కనిపిస్తాడా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి సమాధానం కాదనే చెప్పాలి. ఈ సినిమాలో రెండు పీరియడ్స్ ఉంటాయి. వందల ఏళ్ల నాటి కాలం బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం కథ నడుస్తుంది. మరికొంత భాగం నేటి నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసారుడుగా నెగెటివ్ ఛాయల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇదే సినిమాకు మెయిన్ పాయింట్ అని చెబుతున్నారు.

ఫస్ట్ లుక్ టీజర్ రాగానే అందరూ ఈ సినిమాను ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి సినిమాలతో పోలుస్తున్నారు. కానీ ఈ కథకు ఆ సినిమాలకు ఎలాంటి పోలికలు లేవట. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త కథను ఈ సినిమాతో చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. కనీసం ఈ సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus