Major Review: మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 3, 2022 / 10:25 AM IST

మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం “మేజర్”. మహేష్ బాబు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 26/11 ఎటాక్స్ లో భాగంగా ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం విశేషం. మరి అడివి శేష్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగించగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచి ఆర్మీ, నేవీ మీద విశేషమైన ఇష్టం, దైవభావం కలిగిన యువకుడు సందీప్ (అడివి శేష్). నేవీలో ఫిజికల్ టెస్ట్ లో ఫెయిలైనా.. ఆర్మీలో జాయినవుతాడు. కృషితో ఎన్.ఎస్.జి ట్రైనింగ్ ఆఫీసర్ గా ఎదుగుతాడు. ముంబైలో జరుగుతున్న ఎటాక్స్ లో టెర్రరిస్టులను ఎలా ఎదిరించాడు? అక్కడి అమాయకులను ఎలా కాపాడాడు? అనేది “మేజర్” కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రతి పాత్రకు తన బెస్ట్ ఇచ్చే శేష్.. ఈ చిత్రంలో సందీప్ పాత్రలో జీవించాడు. సందీప్ ముఖం తప్ప.. అతడి వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి.. శేష్ నే సందీప్ గా చూస్తాం. శేష్ చూపే కన్విక్షన్ & హానెస్టీ సినిమాకి పెద్ద ఎస్సెట్.

తండ్రిగా ప్రకాష్ రాజ్ & తల్లిగా రేవతి ఎప్పట్లానే తమ నటనతో కళ్ళు చెమర్చేలా చేశారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. కొన్ని పేలవమైన సన్నివేశాలను కూడా తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేశాడు. క్లైమాక్స్ సీక్వెన్స్ కు శ్రీచరణ్ తన నేపధ్య సంగీతంతో ప్రాణం పోసాడు.

వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. యాక్షన్ సీన్స్ & లవ్ సీన్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం ఫ్రెష్ గా ఉంది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకి మైనస్ గా నిలిచాయి. తాజ్ హోటల్ & క్లైమాక్స్ ఫైట్ రూమ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా చాలా చోట్ల తేలిపోయింది.

దర్శకుడు శశికిరణ్ తిక్కా.. ముంబై దాడిని సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. ఇప్పటికే ఈ నేపధ్యంలో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. వర్మ తెరకెక్కించిన “ది ఎటాక్స్ ఆఫ్ 26/11”, ఇటీవల వచ్చిన “తాజ్ హోటల్” & అమెజాన్ ప్రైమ్ సిరీస్ “ముంబై డైరీస్ 26/11″లో చూపించిన డీటెయిలింగ్ “మేజర్”లో మిస్సయ్యింది. అలాగే చాలా సీన్ కంపోజిషన్స్ జీ5 సిరీస్ “స్టేట్ ఆఫ్ సీజ్ 26/11″ను గుర్తు చేస్తాయి.

అయితే.. శశికిరణ్ ఎలివేట్ చేయాలనుకుంది సందీప్ ఉన్నికృష్ణన్ ను కాబట్టి.. ఆ వివరాలు గాలికొదిలేశాడు అనుకున్నప్పటికీ.. యాక్షన్ & ఎలివేషన్స్ కోసం రియాలిటీను సైతం గాలికొదిలేసి సినిమాటిక్ లిబర్టీని భారీగా వాడుకోవడం మైనస్. అలాగే.. క్యారెక్టర్ ఆర్క్స్ కానీ.. క్యారెక్టరైజేషన్స్ కానీ ఎక్కడా ఎలివేట్ చేయలేదు. అందువల్ల కథకుడిగా అడివి శేష్, దర్శకుడిగా శశికిరణ్ తిక్కా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నారు.

విశ్లేషణ: మేజర్ సందీప్ కు అడివి శేష్ ఇచ్చిన ఘనమైన నివాళి ఆకట్టుకుంటుంది. అయితే.. శ్రుతిమించిన సినిమాటిక్ లిబర్టీస్ & ఎమోషనల్ కనెక్టివిటీ సినిమాలో ప్రేక్షకులు లీనమవ్వకుండా చేసింది.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus