Malli Pelli: ‘మళ్ళీ పెళ్ళి’ టీజర్ రిలీజ్ డేట్,టైం ఫిక్స్..!
April 20, 2023 / 06:04 PM IST
|Follow Us
సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’. నరేష్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవిత్ర కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంది … అయినా సరే ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ నరేష్ మూడో భార్య .. అతనికి విడాకులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో .. నరేష్ – పవిత్ర లు ప్రస్తుతం సహజీవనం స్టేజిలోనే ఉన్నారు.
వీరి పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ‘మళ్ళీ పెళ్ళి'(Malli Pelli) చిత్రం రూపొందుతుండడంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడింది. మరీ ముఖ్యంగా ట్రోలర్స్ దృష్టి పడిందని చెప్పాలి. నరేష్ వికె సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కావడం విశేషం. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ యం.యస్.రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం టీజర్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.
కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో ఏప్రిల్ 21 న అంటే రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ టీజర్ కు భారీ వ్యూస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాలో నరేష్.. పవిత్రని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉన్న వీడియో క్లిప్ ను మొన్నామధ్య పోస్ట్ చేసి.. తమకు పెళ్ళైపోయినట్టు అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఆ రకంగా కూడా సినిమాకి ప్రమోషన్ చేసినట్టైంది.