సినిమా ఇండస్ట్రీలో నాకైతే ఎదురైన అనుభవం అదే : మాళవిక శర్మ
January 7, 2021 / 05:31 PM IST
|Follow Us
క్యాస్టింగ్ కౌచ్..బహుశా ఈ పేరు వినీ వినీ చాలా మందికి బోర్ కొట్టేసుంటుంది కానీ.. చాలా మంది యాంకర్లకు మాత్రం ఈ ప్రశ్న హీరోయిన్లను పలు ఇంటర్వ్యూలలో అడగడం బాగా అలవాటు చేసేసుకున్నారని చెప్పాలి. పోనీ హీరోయిన్లు ఏమైనా ఈ ప్రశ్నకు ఓపెన్ గా సమాధానం చెబుతున్నారా అంటే.. అలా అస్సలు అనిపించదు.తరువాత సినిమా అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతోనో, భయంతోనో వారు నామ మాత్రంగా ‘ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదు’ అంటూ సమాధానం ఇచ్చేసి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు.
సరే ఎలాగూ అందరికీ అలవాటైపోయిన ప్రశ్నే అది.. కాకపోతే జవాబు చెప్పే హీరోయిన్లు మారుతున్నారంతే. ఇప్పుడు ఇదే విషయం గురించి ‘నేల టిక్కెట్’ ‘రెడ్’ సినిమాల హీరోయిన్ మాళవిక శర్మ స్పందించింది. ఆమె మట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది అంటున్నారు. నాకైతే అలాంటిది ఏమీ ఎదురవ్వలేదు. మిగిలినవాళ్ల సంగతి నేను చెప్పలేను” అంటూ సమాధానం ఇచ్చింది. ఇక కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ‘రెడ్’ చిత్రంలో హీరోయిన్ మాళవికను ఎంతో డిఫరెంట్గా ప్రెజెంట్ చేశారట.
సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.మణిశర్మ సంగీతంలో తెరకెక్కిన పాటలు కూడా ఆ అంచనాలను డబుల్ చేశాయని చెప్పాలి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో చూడాలి..!