Mammootty, Akhil: గురు శిష్యులుగా.. అఖిల్-మమ్ముట్టి!

  • July 6, 2021 / 09:06 PM IST

అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ‘ఏజెంట్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ హీరో మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ఈ సినిమా కోసం ఆయనకు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమా మమ్ముట్టి పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై రకరకాల వార్తలు వచ్చాయి. అఖిల్-మమ్ముట్టి తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని.. మమ్ముట్టి విలన్ రోల్ లో కనిపించబోతున్నారని ఇలా చాలా వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో వీరిద్దరూ గురు శిష్యులుగా కనిపించబోతున్నారు. మమ్ముట్టి రోల్ పాజిటివ్ గా ఉంటుందట. కాకపోతే ఇద్దరి క్యారెక్టరైజేషన్లు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతాయని అంటున్నారు.

ముందుగా ఈ పాత కోసం చాలా మంది ప్రముఖుల పేర్లను పరిశీలించారు. కానీ ఫ్రెష్ కాంబోని తెరపై చూపించాలని మమ్ముట్టిను తీసుకొస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus